యూనివర్సిటీలో కలకలం: వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఆందోళన
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినట్లు విద్యార్థి రేవంత్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరపాలని, యూనివర్సిటీని భ్రష్టుపట్టిస్తున్న సిండికేట్ బ్రోకర్లను శాశ్వతంగా బహిష్కరించాలని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.