విజయనగరంలో ఇళ్ల పట్టాలు అందించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇవాళ తన జీవితం ధన్యమైందని, నివసిస్తున్న ఇళ్లపై సర్వహక్కులు లబ్ధిదారులకే ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 11 మండలాల పరిధిలోని 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన పేర్కొంటూ, ఇళ్ల పట్టాలు అందుకున్న అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.