మల్లన్నసాగర్ బ్లాస్టింగ్ వివాదంపై బీఆర్ఎస్ ఫైర్: కాళేశ్వరాన్ని కూల్చే కుట్ర
రిపోర్టర్: అశోక్
స్థలం: సిద్దిపేట
మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిసరాల్లో అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్‌తో పేలుళ్లు జరపడంపై ఇరిగేషన్ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని మండిపడ్డారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు అధికారుల అత్యుత్సాహం వల్ల రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉందని, వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు.