'పల్లె పండుగ 3.0'లో గోకుల్ షెడ్ల నిర్మాణం: ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శంకుస్థాపన

రిపోర్టర్: వెంకట్ స్థలం: Mopada, Vizianagaram

పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోపాడ గ్రామంలో గోకుల షెడ్ల నిర్మాణానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శంకుస్థాపన చేశారు. గ్రామీణాభివృద్ధి మరియు రైతుల సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పశువుల సంరక్షణకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.