పటాన్‌చెరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: అశోక్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల పరస్పర ఆందోళనలతో జాతీయ రహదారి రణరంగంగా మారింది. ఇరు పార్టీల నేతలు నువ్వా-నేనా అంటూ పోటాపోటీ నిరసనలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు సైతం ఆందోళనలో పాల్గొనడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేసి, ఇరువర్గాల ముఖ్య నేతలను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపు చేశారు.