రాజమండ్రిలో వికసిత్ భారత్ సంకల్ప సభ: ఇరవై ఐదు ఏళ్ల ప్రజాసేవ ఘనత
రిపోర్టర్: కిరణ్
స్థలం: తూర్పు గోదావరి
దేశ ప్రజల కోసం రెండున్నర దశాబ్దాల పాటు నిరంతరం ప్రజాసేవ అందించిన చారిత్రక సందర్భమని పురందేశ్వరి వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వేదికగా నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి యాత్రతో పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ విశిష్ట వేడుకలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ సేవా స్పూర్తిని చాటుకున్నారు.