ఓట్ల చోర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని రాహుల్ గాంధీ హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ఓట్లను దొంగిలించే వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ వేదికగా ఆయన హెచ్చరికలను పంచుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.