శాన్ హోస్ నగరంలో ఘనంగా దీపావళి సంబరాలు: తరలివచ్చిన వేలాది మంది
రిపోర్టర్: కృష్ణ
స్థలం: శాన్ హోస్
శాన్ హోస్ నగరంలో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. బే ఏరియా వ్యాప్తంగా పది వేలకు పైగా భారతీయులు ఈ సాంస్కృతిక వేడుకలకు తరలివచ్చారు. శాన్ హోస్ మేయర్ మ్యాట్ మహాన్, భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ గాయకుడు అబ్బి వి లైవ్ మ్యూజిక్ కచేరీ ఈవెంట్కు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.