పాలకొండ అభివృద్ధికి ఉంగరం గుర్తుకే ఓటేయాలంటూ మహేష్ విస్తృత ప్రచారం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ నగరపంచాయితీ 27వ వార్డు స్వతంత్ర అభ్యర్థి యజ్జల మహేష్ ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానని స్పష్టం చేశారు. సామాన్య వ్యక్తి అయిన తనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.