రాజీ మార్గంలో సత్వర న్యాయం అందించిన లోకధాలత్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
నగరి స్థానిక జూనియల్ సివిల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన లోకధాలత్లో 194 కేసులు పరిష్కారం కాగా రూ. 11.98 లక్షలు సెటిల్ అయింది. రాజీ మార్గమే రాజ మార్గంగా భావించి కక్షిదారులు భేషజాలకు పోకుండా తమ కేసులు పరిష్కరించుకోవాలని జడ్జి సురేష్‌బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, ఎక్సైజ్, ఐపీసీ తదితర కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమంలో సభ్యులు, న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.