ఐఐటీల్లో కుల వివక్ష లేదంటూ ప్రొఫెసర్ల మద్దతు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ముంబై
ఐఐటీ బాంబే విద్యార్థి సాల్ వాకోడ్ ఆత్మహత్య ఉదంతం నేపథ్యంలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లపై వస్తున్న కుల వివక్ష ఆరోపణలను పలువురు ఐఐటీ అధ్యాపకులు తీవ్రంగా ఖండించారు. ఐఐటీ వ్యవస్థలో కుల వివక్షకు తావులేదని, ఎప్పుడూ అలాంటి సంఘటనలు తాను చూడలేదని ప్రొఫెసర్ ప్రవేశ్ బియానీ స్పష్టం చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా, ఐఐటీ బాంబే ప్రొఫెసర్ దూళ్ల తాత్కాలిక సస్పెన్షన్ విధించింది.