అయ్యప్ప ఆలయ మెట్ల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానన్న ఎమ్మెల్యే ఐలయ్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు గురువారం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలయంలో పద్దెనిమిది మెట్ల నిర్మాణానికి తగిన సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఆయన తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.