అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై నిరుపేదల ఆగ్రహం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాగజ్ నగర్
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గూడు లేని నిరుపేదలకు కాకుండా విలాసవంతమైన భవనాలు కలిగిన బడా వ్యాపారులకు కేటాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రోత్బలంతోనే అనర్హులకు ఇవి దక్కాయని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న నిజమైన పేదలకు అన్యాయం జరుగుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.