రైల్వే ప్రయాణికులకు తీపి కబురు: డోర్ టూ డోర్ పార్సిల్ సేవలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

రైల్వే స్టేషన్కు వెళ్లి పార్సిల్ బుక్ చేసే ఇబ్బందులకు త్వరలో తెరపడనుందని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఈ డోర్ టూ డోర్ పార్సిల్ సేవల ద్వారా వినియోగదారులు ఇంటి వద్దే పార్సిల్ను పికప్ చేసి గమ్యస్థానానికి పంపుకోవచ్చని పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఎంపిక చేసిన ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.