ఈసీ తీరుపై మండిపడుతూ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు జరపాలన్న మమత
రిపోర్టర్: నరేష్
స్థలం: కోల్‌కతా
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఈసీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. పాత జాబితా ఆధారంగా రాష్ట్రంలో వెంటనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. త్వరలోనే ఇండియా కూటమి సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.