తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి కలకలం రేపిన చిరుతపులి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలోని 2765వ మెట్టు వద్ద చెట్టుపై చిరుత దర్జాగా కూర్చుని ఉండటాన్ని భక్తులు గమనించి భయాందోళనలకు గురయ్యారు. వెంటనే టీటీడీ భద్రతా సిబ్బంది, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, అధికారులు అప్రమత్తమై భక్తులను గుంపులు గుంపులుగా పంపుతూ చిరుత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.