అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: సునీల్ స్థలం: Amaravati

అమరావతి ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశమంతా ఇప్పటికే అమరావతి గురించి మాట్లాడుతోందని, రాబోయే రోజుల్లో ప్రపంచం కూడా మాట్లాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులపై మరియు భవిష్యత్ ప్రణాళికలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.