అనకాపల్లిలో ఎన్నికల బహిష్కరణ: రిజర్వేషన్ మార్పును నిరసిస్తూ ఓటింగ్ కు దూరంగా గ్రామస్థులు
రిపోర్టర్: అశోక్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెం గ్రామంలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలను గ్రామస్థులు పూర్తిగా బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. సర్పంచ్ స్థానం రిజర్వేషన్ను బీసీల నుండి ఎస్సీలకు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్థానికులు ఈ నిరసనకు దిగారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామస్థులతో చర్చలు జరుపుతున్నారు.