నారాయణవనం ఉప ఎన్నికలో రికార్డు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గిరిబాబు విజయదుందుభి
రిపోర్టర్: MC KISHORE
స్థలం: నారాయణవనం
నారాయణవనం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి గిరిబాబు ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీపై సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ చారిత్రాత్మక విజయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నాయి. విజయం సాధించిన గిరిబాబును పార్టీ నేతలు అభినందించారు.