హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో కీలక మార్పులు: డివిజన్లు, సరిహద్దులు సవరిస్తూ జీవో జారీ

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

నగర విస్తరణ, జీహెచ్ఎంసీ పరిధిలోని పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జోన్లు, డివిజన్లు, ఠాణాల సరిహద్దులను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసిందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ తెలిపారు. ఆర్జీఐఏ డివిజన్ను శంషాబాద్గా, చిక్కడపల్లిని కాచిగూడగా, సంతోష్నగర్ను ఛత్రినాక డివిజన్గా మారుస్తూ, బడంగ్పేట్ పోలీస్ స్టేషన్ను రద్దు చేస్తూ కొత్త సరిహద్దులను ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.