ఇబ్రహీంపట్నంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీ చేధన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం రేపిన కళ్యాణి హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో కుమారుడిని తిరిగి ఇవ్వాలని కోరినందుకే ప్రియుడు షఫి ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి కెనాల్లో పడేశాడు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా సోదరుడు గుర్తించగా, సోషల్ మీడియా ప్రచారం ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.