వరంగల్ జిల్లాలో మార్చురీలో మృతదేహం కన్ను కొరికిన ఎలుకలు
రిపోర్టర్: సురేష్
స్థలం: వరంగల్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మార్చురీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయపర్తిలో శనివారం రాత్రి వాహనం ఢీకొని మృతి చెందిన గారే వీరయ్య మృతదేహం కంటిని ఎలుకలు కొరికేశాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించగా ఈ ఘటన జరిగింది. మార్చురీ గదిలో కనీస వసతులు లేకపోవడం, భద్రత కరువవడంపై మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.