శ్వేతపత్రం విడుదల చేశాకే సీఎం రేవంత్ సిరిసిల్లలో అడుగుపెట్టాలంటూ కేటీఆర్ సవాల్

రిపోర్టర్: అశోక్ స్థలం: రాజన్న సిరిసిల్ల

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్లలో భూ దోపిడీపై సీఎం చేస్తున్న నిరాధార ఆరోపణలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆ తర్వాతే జిల్లాలో అడుగుపెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించకపోతే ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేతన్నల బకాయిలు చెల్లించాలని, నిలిచిపోయిన బతుకమ్మ చీరలు, రైతు బీమా పథకాలను పునరుద్ధరించాలని లేఖలో కోరారు.