తెలుగులో మాట్లాడి అందరిని ఆకట్టుకున్న ది ప్యారడైజ్ నటి కయాదు లోహర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ది ప్యారడైజ్ ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న కయాదు లోహర్ స్వయంగా తెలుగులో మాట్లాడుతూ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు ప్రేక్షకులపై తనలో ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె మాట్లాడిన తీరు అక్కడున్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.