దారుణం: పరువు హత్యకు పాల్పడి సొంత చెల్లెలిని పొట్టనబెట్టుకున్న అన్న
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Saharanpur
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్పూర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగు చూసింది. గదిలో యువకుడితో చూశాననే కోపంతో ఇరవై ఏడేళ్ల చెల్లెలు కోమల్‌ను దుపట్టాతో ఉరివేసి హత్య చేసినట్లు నిందితుడు ఆశిష్ కుమార్ అంగీకరించినట్లు రూరల్ ఎస్పీ మయాంక్ పాఠక్ తెలిపారు. కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి పిన్న తండ్రి సురేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.