ఉప్పల్ హబ్సిగూడ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన సీఈఓ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో సీఈఓ సి.సుదర్శన్ రెడ్డి పర్యటించి ఎస్ఐఆర్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటనలో ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీసీ ఆనంద్, తహసీల్దార్ ఫూల్సింగ్, ఏఈఆర్ఓ స్వప్న తదితర అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ఓటర్ల వివరాల పరిశీలన అంశాలను అధికారులు వివరించగా, నిబంధనల ప్రకారం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సీఈఓ సూచించారు.