శ్రీశైలంలో కన్నులపండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు: కూష్మాండదుర్గ అలంకారంలో భ్రమరాంబిక దర్శనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: శ్రీశైలం

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో బుధవారం భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ప్రత్యేక వేదికపై కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు, వేదపండితులు ఘనంగా పుష్పార్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అలంకార మండపంలో కైలాస వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆశీనులు కాగా, ఉభయ దేవాలయాల అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. మంగళవాయిద్యాలు, కళాకారుల సందడి నడుమ స్వామి, అమ్మవార్లకు శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవం అత్యంత శోభాయమానంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.