బిఆర్ఎస్ బిజెపి దళిత వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ వర్ధన్నపేటలో కాంగ్రెస్ నేతల భారీ రాస్తారోకో

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్, బిజెపి దళిత వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై కాంగ్రెస్, దళిత సంఘాలు భారీ రాస్తారోకో చేపట్టాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్పై వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై అట్రాసిటీ కేసు పెట్టి కేసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యుపిలో ఖర్గే సభా స్థలాన్ని అవమానించిన బిజెపిపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.