తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీఎస్

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సాయిప్రసాద్ ఆదేశించారు. సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఆరు నెలల పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, తాగునీటిని అక్రమంగా మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు.