టాలీవుడ్ హీరో నాని లైనప్ మార్పు: ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఎమోషనల్ లవ్స్టోరీ

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

గత రెండేళ్లుగా వరుస యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో నాని తన సినీ ప్రయాణంలో కీలక మార్పునకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మాస్ జానర్కు కొంతకాలం పాటు విరామమిచ్చి, తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించనున్న ఓ అద్భుతమైన భావోద్వేగపూరిత ప్రేమకథలో ఆయన నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా టాలెంట్ నటి రుక్మిణి వసంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.