అమెరికాలో వైభవంగా సౌత్ బ్రన్స్ విక్ గర్బా ఉత్సవం: ఘనంగా వేడుకలు
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూజెర్సీ
అమెరికాలోని న్యూజెర్సీలో ఇండో అమెరికన్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్బా వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రెసిడెంట్ డాక్టర్ తుషార్ పటేల్ నేతృత్వంలో జరిగిన ఈ రెండు రోజుల సాంస్కృతిక కార్యక్రమంలో వేలాది మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలు, దాండియా ప్రదర్శనలతో వేదిక ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొందని, స్థానిక మేయర్లు మరియు ప్రముఖులు ఈ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారని నిర్వాహకులు వెల్లడించారు.