విజయనగరంలో యువజనోత్సవాల పోటీల నిర్వహణపై సెట్విజ్ ప్రకటన
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
వచ్చే ఏడాది జనవరిలో జరిగే యువజనోత్సవాల సందర్భంగా విజయనగరం మహారాజా అటానమస్ కళాశాలలో ఈ నెల 30న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు సెట్విజ్ సీఈవో వి.వి.అప్పలనాయుడు తెలిపారు. యువజన సర్వీసులు శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో 15 నుంచి 29 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. జానపద నృత్యాలు, గీతాలు, వీధి నాటకం, కవిత్వం, పెయింటింగ్ తదితర అంశాలలో పోటీలు ఉంటాయని, ప్రథమ స్థానం సాధించినవారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని వెల్లడించారు.