విజయనగరం జిల్లాలో లారీ టిప్పర్ ఢీకొని డ్రైవర్ మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోడ్‌ లారీ, టిప్పర్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా పోలీసులు నాలుగు గంటలు శ్రమించి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.