ఆంధ్రప్రదేశ్‌లో పాకిస్థాన్ గూఢచర్య నెట్వర్క్ కలకలం: నేవీ సిబ్బంది అరెస్ట్
రిపోర్టర్: రమేష్
స్థలం: విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్‌లో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో గుట్టురట్టయిన గూఢచర్య నెట్‌వర్క్‌పై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఆపరేషన్ ఫైర్‌వాల్‌లో భాగంగా పద్దెనిమిది మంది అనుమానితులపై దృష్టి సారించామని, వీరిలో పదమూడు మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌తో పాటు కోయంబత్తూరుకు చెందిన నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.