ఢిల్లీలో దారుణం, బాలికను కట్టేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో 10 ఏళ్ల ఆరో తరగతి విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్టేషనరీ వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్లిన బాలికపై నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.