జిల్లా ఉత్తమ ఎంఈఓగా మునగాల వెంకటేశ్వర్లు ఎంపిక
రిపోర్టర్: Bhradwaj
స్థలం: మునగాల
మునగాల జడ్పీ ఉన్నత పాఠశాల ఎంఈఓగా విధులు నిర్వర్తిస్తున్న పి.వెంకటేశ్వర్లు 2026 జిల్లా ఉత్తమ ఎంఈఓ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సామర్థ్యాల పెంపులో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.
తక్కువ కాలంలోనే విద్యావ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకువచ్చిన వెంకటేశ్వర్లును పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. ఈ అవార్డు రావడం పట్ల స్థానిక విద్యా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.