దేవునిగూడెం పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, బెల్టుల పంపిణీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దస్తురాబాద్

దస్తురాబాద్ మండలం దేవునిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు యూనిఫామ్స్ మరియు బెల్టులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ గంగన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఉపాధ్యాయులు రాజ్కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ రమ తదితరులు పాల్గొన్నారు.