అగ్నివీరులకు భారీ ఊరట: మరో రెండేళ్ల పాటు సేవలందిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
అగ్నివీరుల సర్వీస్ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి బుధవారం కీలక ప్రకటన చేశారు. తొలి విడత అగ్నివీరుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదనపు కాలంలో వీరికి మరింత మెరుగైన వేతనాలు లభిస్తాయని, ఆ తర్వాత రెగ్యులర్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.