కోచ్ మైక్ మెక్‌డానియల్‌పై టైరీక్ హిల్ భావోద్వేగ పోస్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: USA

ఎన్ఎఫ్ఎల్ స్టార్ టైరీక్ హిల్ తన మాజీ కోచ్ మైక్ మెక్‌డానియల్ కోసం సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం పంచుకున్నారు. మయామి డోల్ఫిన్స్ జట్టులో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ 'మిస్ యూ డియర్ ఫ్రెండ్' అంటూ స్నాప్‌చాట్ స్టోరీ పెట్టారు. ప్రస్తుతం ఫ్రీ ఏజెంట్‌గా ఉన్న హిల్, ఛార్జర్స్ కోచ్‌గా మారిన మెక్‌డానియల్‌తో మళ్లీ కలుస్తారనే చర్చ నడుస్తోంది.