ఆధ్యాత్మిక నిలయానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

ఒకరోజు పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనను పురస్కరించుకుని అధికారులు విమానాశ్రయం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాలోని వెంకటాచలానికి బయలుదేరి వెళ్లారు.