స్వయం ఏపీ బ్రాండ్‌తో మహిళల ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

నెల్లూరు పట్టణ పొదుపు మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం 'స్వయం ఏపీ' బ్రాండ్‌ను ప్రారంభించింది. మెప్మా ఆధ్వర్యంలో నాణ్యత పరీక్షలు నిర్వహించి, 100 రకాల వస్తువులను ఆన్‌లైన్ వేదికల ద్వారా విక్రయించేలా చర్యలు చేపట్టారు. స్థానిక వంటకాలు, హస్తకళలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తూ, మహిళా స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.