బీజేపీ నేత నాగం వర్షిత్ రెడ్డి పరామర్శ.. కఠిన చర్యలకు డిమాండ్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
నల్గొండలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో, శుక్రవారం నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు ఆయనను నివాసంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.