తెలంగాణలో ఆర్టిఫిషియల్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం నకిలీ మరియు ఆర్టిఫిషియల్ పనీర్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రసాయనాలతో తయారయ్యే ఈ నాన్-డెయిరీ పనీర్ తయారీ, నిల్వ, విక్రయాలపై ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులు సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.