యూఎస్ ఓపెన్: మీడియా సమావేశాలకు హాజరుకాకపోతే 50 వేల డాలర్ల జరిమానా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్రీడాకారులు తప్పనిసరిగా మీడియా సమావేశాలకు హాజరుకావాలి. ఓటమి తర్వాత కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి మీడియా ముందుకు రాకపోతే, సదరు క్రీడాకారులకు 50 వేల డాలర్ల భారీ జరిమానా విధిస్తారు. అనారోగ్యం లేదా గాయాల వంటి సరైన కారణాలు ఉంటే తప్ప, ఈ మీడియా బాధ్యతల నుండి ఎవరికీ మినహాయింపు ఉండదని గ్రాండ్‌స్లామ్ రూల్ బుక్ స్పష్టం చేస్తోంది.