అమెరికాలో భారతీయ యువతి షాలిని ఠాకూర్ బీభత్స హత్య!

రిపోర్టర్: సతీష్ స్థలం: అమెరికా

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన షాలిని ఠాకూర్ దారుణ హత్యకు గురయ్యారు. పెళ్లి చేసుకోవాలని ఏడాదిగా వేధిస్తున్న రోహిత్ అనే యువకుడు శాక్రమెంటోలోని ఓ రెస్టరెంట్ బయట ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వేధింపులకు పాల్పడిన నిందితుడు, పోలీసులకు చిక్కకుండా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.