నాలుగు రాష్ట్రాల పురుషులకు ఉద్యోగాలు ఇవ్వబోమన్న బెంగళూరు సీఈఓ

రిపోర్టర్: శివ స్థలం: కర్ణాటక

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుషులను ఇకపై తమ సంస్థలో ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని బెంగళూరుకు చెందిన ఏవన్ స్పోర్ట్స్ వరల్డ్ సంస్థ సీఈఓ కార్తీక్ ఎస్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఉద్యోగి ఒకరు మహిళా సహోద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు పాల్పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరగడంతో పాటు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.