హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా గూడూరులో సంచలనం సృష్టించిన శ్రీనివాసులు హత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. నాయుడుపేటకు చెందిన బెన్హర్, అనిల్, సాగర్‌లు శ్రీనివాసులుపై దాడి చేసి హత్య చేశారు. 2021లో నమోదైన ఈ కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో 7వ అదనపు జిల్లా కోర్టు సోమవారం ఈ సంచలన తీర్పు వెలువరించింది. దోషులకు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు.