కోనసీమ జిల్లాలో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ప్రారంభించిన ఎస్పీ
రిపోర్టర్: అశోక్
స్థలం: కోనసీమ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేర పరిశోధన వేగవంతం చేసేందుకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అమలాపురంలో ప్రారంభించారు. ఈ అత్యాధునిక వాహనం ద్వారా సంఘటన స్థలంలోనే క్లూస్ సేకరించి, దర్యాప్తును మరింత పారదర్శకంగా చేపట్టేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. నేరాల నియంత్రణకు, త్వరితగతిన న్యాయం అందించేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.