సినీ ప్రయాణంపై శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు: నటిగా మారడం యాదృచ్ఛికమేనని వెల్లడి

రిపోర్టర్: శివ స్థలం: కోచి

సినీరంగంలోకి రాకముందు రచయితగా రాణించాలనే కోరిక బలంగా ఉండేదని, అనుకోని పరిస్థితుల వల్ల నటిగా మారాల్సి వచ్చిందని ప్రముఖ నటి శృతిహాసన్ వెల్లడించారు. కోచిలో జరుగుతున్న ఇండియా టుడే సౌత్ 2026 సదస్సులో పాల్గొన్న ఆమె తన సినీ కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అద్భుతమైన సినీ వారసత్వం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ నటన తన మొదటి ఎంపిక కాదని ఆమె స్పష్టం చేశారు.