అక్టోబర్ ఐదు నుంచి క్యాట్ 2026 దరఖాస్తుల సవరణ
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఐఐఎంలలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ 2026 దరఖాస్తుల సవరణ గడువును అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్ వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులలో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అలాగే పరీక్షా కేంద్రాల ఎంపిక వంటి నిర్దిష్ట అంశాలను మాత్రమే సవరించుకునేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎడిట్ విండో అందుబాటులో ఉంటుందని తెలిపారు.